ఎన్టీఆర్.. బాలయ్య మధ్య దూరం.. ‘తెర’ వెనుక రాజకీయం..!

Friday, January 8th, 2016, 11:21:09 AM IST


సినిమా అంటే ఎంటర్టైన్మెంట్.. కాసేపు సరదాగా.. అన్ని టెన్సన్స్ ను మర్చిపోవడానికి సినిమాకి వెళ్తాం. ఇటువంటి సినిమాకు ఇప్పుడు రాజకీయం రంగు పులుముకున్నది. సినిమా ప్రారంభం నుంచి ఆ సినిమా పూర్తయ్యే వరకు ఒకెత్తైతే సినిమా విడుదల కావడం మరో ఎత్తు. ఇప్పుడు సినిమా విడుదల కావడం వెనుక రాజకీయాలు జరుగుతున్నాయి. రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి అనే అనుమానం రావొచ్చు. ఆ అనుమానాలకు నివృత్తి చేద్దాం.

ఇటీవల కాలంలో నందమూరి హీరోల మధ్య దూరం విపరీతంగా పెరిగిపోతున్నది. కలిసిపోతారు అనుకున్నా.. వారు కలవడంలేదు. పైగా దూరం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఒకప్పుడు నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్ లు ఒకరి ఆడియో వేడుకకు మరొకరు హారజయ్యేవారు. ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకునే వారు. అయితే, హటాత్తుగా అంతా మారిపోయింది. సంబంధాలు తెగిపోయాయి.

2004 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. ఈ ప్రచారం సూపర్ హిట్ అయింది. కాని, ఆ ఎన్నికలలో పార్టీ ఓడిపోయింది. తాత స్థాపించిన పార్టీ అని, ఎప్పుడు పిలిచినా.. తప్పకుండా వచ్చి తన సహాయం అందిస్తానని గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఎన్నికల తరువాతే.. క్రమంగా ఎన్టీఆర్ ను పక్కన పెట్టడం మొదలు పెట్టారు. 2007లో బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఇచ్చి వివాహం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ హావా మొదలైంది.

అయితే, బాలకృష్ణ సభలలో ఆకట్టుకునే విధంగా మాట్లాడలేడు. ఇది బాబుకు కలిసొచ్చింది. బాలయ్యను పార్టిలో ఉంచుకుంటే.. తనకు అనుకూలంగా ఉంటారని ఎత్తు వేశారు. బాలయ్యను బాబు దగ్గర చేసుకుంటూ.. ఎన్టీఆర్ ను దూరంగా పెట్టారు. ఆ తరువాత.. బాలయ్యకు.. ఎన్టీఆర్ కు మధ్య దూరం కూడా పెరుగుతూ వస్తున్నది. ఇక, ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న నాన్నకు ప్రేమతో.. డిక్టేటర్ సినిమాల విషయంలో కూడా అదే జరుగుతున్నది. ఎన్టీఆర్ కు నైజాం ఏరియాలో మంచి పట్టుఉన్నది. అభిమానులు సైతం అధికంగా ఉన్నారు. కాని, బాలకృష్ణకు నైజాంలో పెద్దగా పట్టులేదు. ఇకపోతే, డిక్టేటర్ సినిమా విడుదల విషయంలో లోకేష్ రాజకీయం చేస్తున్నారని వినికిడి.

నైజాం ఏరియాను ఎన్టీఆర్ కు వదిలేసి.. ఆంధ్రా సీడెడ్ ఏరియాలలో నాన్నకు ప్రేమతో సినిమాకు థియేటర్స్ దొరక్కుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి పంపిణీదార్లకు ఫోన్ చేసి ఎన్టీఆర్ సినిమా కొనద్దని.. థియేటర్స్ లో వేయవద్దని చెప్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇక, ఇంతవరకు నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించలేదు. సెన్సార్ కూడా ఇంకా పూర్తికాలేదు. డేట్, సెన్సార్ కాకముందే ఆ సినిమాగురించి ఇంత రాజకీయం చేస్తున్నారు అంటే.. నాన్నకు ప్రేమతో కు ఎంతటి డిమాండ్ ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.