పొలిటికల్ సెటైర్స్ : పంతం.. పంతం.. నీదా.. నాదా.. సై

Tuesday, March 22nd, 2016, 03:45:36 AM IST


బాబాయ్ : ఏందిరా అబ్బాయ్.. అసెంబ్లీ లోపల కన్నా అసెంబ్లీ బయటే రచ్చ రచ్చగా ఉన్నట్టుంది.
అబ్బాయ్ : అవును బాబాయ్.. అసెంబ్లీ బయట రోజా నిరసన చేస్తున్నారు. లోపలేమో వైసీపీ నాయకులు వాదన చేస్తున్నారు.
బాబాయ్ : అయినా కోర్టు చెప్పిన తరువాత కూడా రోజాను అసెంబ్లీలోకి రానివ్వకపోవడమేమిటి విచిత్రం కాకపొతేను.
అబ్బాయ్ : కోర్టుకి శాసన సభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కులేదట. టీడీపీ నాయకులు చెబుతున్నారు.
బాబాయ్ : న్యాయ వ్యవస్థ ఉత్తర్వులను నాయకులే పెడ చెవిన పెడితే ఎలా..?
అబ్బాయ్ : పెడ చెవిన పెట్టలేదు.. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించారు.
బాబాయ్ : మరి వైసీపీ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు..?
అబ్బాయ్ : ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడిందంటూ వాళ్ళూ కోర్టు కెళ్ళారు.
బాబాయ్ : అంటే ఇద్దరూ పంతం మీదే ఉన్నారన్న మాట.
అబ్బాయ్ : అవును ఈ పోరులో చివరికి ఎవరు తలొగ్గుతారో చూడాలి.