పొలిటికల్ సెటైర్స్ : కోటీశ్వరులు కాబట్టే జనాలు వాళ్ళను గెలిపించారు.. అసెంబ్లీకి పంపించారు..!

Tuesday, May 24th, 2016, 10:29:56 AM IST

political-satires
అబ్బాయ్ : బాబాయ్.. ఇది విన్నావా.. మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో సగంమందికి పైగా కోటీశ్వరులేనట..!

బాబాయ్ : అవున్రా అబ్బాయ్.. నేను విన్నా. గెలిచినోళ్ళంతా బాగా ఉన్న(తిన్న) వాళ్లేనంట.

అబ్బాయ్ : పుదుచ్చేరిలో గెలిచిన 30 మందిలో 25 మంది, తమిళనాడులో అయితే 223 మందిలో 170 మంది కోట్లకు పడగలెత్తిన వాళ్లేనట..!

బాబాయ్ : అలా కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కాబట్టే వాళ్ళంతా ఎమ్మెల్యేలయింది.

అబ్బాయ్ : అయినా అంతంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటావ్..?

బాబాయ్ : ఎక్కడినుంచేమిటిరా.. జనాల దగ్గర్నుంచే కదా.

అబ్బాయ్ : అవునా.. మరి జనాలకు ఆ విషయం తెలీదా..?

బాబాయ్ : ఎందుకు తెలీదు. తెలుసు. అయినా కోటీశ్వరులు ఎమ్మెల్యేలయితే వాళ్ళకే కదా గొప్ప. అందుకే గెలిపించుంటారు.