పొలిటికల్ సెటైర్స్ : రోజా గారికి సెలవులిచ్చారోచ్..?

Tuesday, December 22nd, 2015, 03:00:50 PM IST


అబ్బాయ్: బాబాయ్ చూశావా..మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఎం జరిగిందో..?
బాబాయ్: కొత్తగా ఏం జరిగుంటుంది.?
ఎప్పటిలా ఈసారీ నాలుగు అరుపులు..రెండు వాయిదాలు అంతేగా..
అబ్బాయ్: అబ్బా..ఈసారి ఎప్పటిలా కాదు.
కాస్త ఎక్కువే జరిగింది.
బాబాయ్: ఏం జరిగింది..?
అబ్బాయ్: రోజా గారు అదికార పక్షంపై చేసిన విమర్శలకు ఆమెను హౌస్ నుంచి సంవత్సరం సస్పెండ్ చేశారు.
బాబాయ్: అవునా.. అయితే ఆవిడకి సంవత్సరం సెలవులిచ్చారన్నమాట..?
ఇక ఎంచక్కా ఓ నాలుగు సినిమాలు చేసుకోవచ్చు..నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు.
అబ్బాయ్: అమ్మ బాబాయ్..కర్తవ్య బోధ భలే చేశావే..!