చిన్నారి పవన్ ఆ తల్లికి ఏం బహుమతి ఇచ్చాడో తెలుసా..?

Monday, May 9th, 2016, 12:21:39 PM IST

baahubali-pawan-kumar
బాహుబలి సినిమాలో అమ్మ రోజు శివలింగానికి అభిషేకం చేసేందుకు ప్రతిరోజూ బిందెలతో నీళ్ళను తీసుకొని సెలయేరు నుంచి తీసుకొని వచ్చి అభిషేకం చేసేది. అయితే, ఆ తల్లి బాధను చూడలేక.. బాహుబలి శివలింగాన్నే తీసుకెళ్ళి సెలయోరులో ఉంచుతాడు. ఇప్పుడు ఇటువంటి సంఘటనే కర్ణాటకలోని శివమోగ్గ జిల్లలో జరిగింది. ఓ తల్లి రోజు కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్ళు తెచ్చుకునేది. ఆ తల్లి బాధను చూడలేక.. అతని కొడుకు ఇంట్లోని పెరట్లో రెండు నెలలపాటు కష్టపది 45 అడుగుల బావిని ఒక్కడే తవ్వి మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ వార్త నెట్ లో హల్ చల్ చేస్తున్నది.