పవన్ కల్యాణ్ నమ్ముకున్నది కేవలం తన అభిమానుల్ని మాత్రమేనా..?

Sunday, May 22nd, 2016, 03:00:45 AM IST


పవన్ కళ్యాణ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అశేషమైన ఆయన అభిమానగణం. తెలుగునాట ఏ హీరోకీ సాధ్యంకానంత ఫాలోయింగ్ పవన్ కు ఉంది. సినిమాల్లో టాప్ స్థానాన్ని అందుకున్న పవన్ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం స్వయంగా జనసేన పార్టీని కూడా స్థాపించారు. ఎటువంటి ఆర్ధిక, రాజకీయ బలగం లేని పవన్ అంత అకస్మాత్తుగా పార్టీ పెట్టడానికి ఆయనుకున్న అభిమానుయ్లే కారణమని చెప్పొచ్చు. ఆయన అనుకున్నట్టే అభిమానులు కూడా అడుగడుగునా ఆయన వెంట నిలిచి 2014 ఎన్నికల్లో తమ అభిమానాన్ని పూర్తి స్థాయిలో చాటుకున్నారు కూడా.

కానీ ఈసారి 2019లో రాబోయే ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ అధినేత బాబు అంట సులభంగా లొంగే ఓటమిని ఒప్పుకునే వ్యక్తి కాదు. పైగా రాష్ట్రం కోసం కాస్తో కూస్తో కష్టం చేస్తూనే ఉన్నారు. ఇకపోతే మిగిలింది జగన్. ఇప్పుడిప్పుడే రాజకీయం నేర్చుకుంటున్న ఆయన కూడా 2019 నాటికీ బలం పుంజుకునే అవకాశముంది. కాబట్టి ఈసారి అభిమానగణంతోనే పవన్ సక్సెస్ అందుకోవడం కష్టం. పవన్ కూడా ఇదే విషయాన్ని గ్రహించి తన అభిమాన శక్తికి తోడు సామాన్య జనశక్తిని కూడా కూడగట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడని రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.