‘వారసత్వాన్ని పెద్దగా నమ్మనంటున్న’ పవన్ కల్యాణ్ మనసులోని మాటలు

Sunday, March 13th, 2016, 05:18:22 PM IST


పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ఇవి గత రెండు మూడు రోజుల నుండి టీవీల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోను వినిపిస్తున్న పదాలు. సినిమా నుండి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ‘అనుపమ చోప్రాతో’ జరిగిన ఇంటర్వ్యూలో ‘నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు.. బలవంతంగా తీసుకురాబడ్డాను. ఇంకో 2, 3 సినిమాలు చేసి ఆ తరువాత మానేస్తా. సినిమాలకన్నా రాజకీయాలే సేఫ్’ అంటూ తన నిజాయితీని చాటి ‘స్పృహలో ఉండి నేనేం చేసినా అందుకు నేనే భాద్యుడిని’ తన మీద తనకున్న నియంత్రణను తెలుపుతూ ‘భవిష్యత్తులో శాంతి భద్రతల గురించే ఆలోచిస్తానంటూ’ సమాజం పట్ల తన భాద్యతను గుర్తుచేసుకుని ‘వారసత్వాన్ని నమ్మనంటూ’ తనలో అంకిత భావాన్ని భయటపెట్టి ‘మన పని మనం చేసి వెంటనే మాయమైపోవాలి’ అనే జీవిత సత్యాన్ని తెలియపరిచిన పవన్ మనసులో ఊహకందని ఆలోచనలు, అబ్బురపరిచే నిబద్దతలు, సామాన్య మనిషికి అవసరమైన రాజకీయ లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. సందర్బాన్ని, సమయాన్ని బట్టి అవి బయటకొస్తాయి. ప్రస్తుతం ఆయన మనసులో ఉన్న కొన్ని ఆలోచనలను బయటకు పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ వీడియో పార్ట్ 1

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ వీడియో పార్ట్ 2

పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ వీడియో పార్ట్ 3