‘అజిత్’ తో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఒకే చెప్పిన ‘పవన్ కళ్యాణ్’

Monday, July 11th, 2016, 04:25:36 PM IST


మామూలు హీరోలే మరో హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయమని అడిగితే సవాలక్ష ప్రశ్నలు వేసి, కండీషన్లు పెట్టేఈ రోజుల్లో ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి సినిమా చేస్తే. అదీ ఆ స్టార్లలో ఒకరు పవన్ కళ్యాణ్, మరొకరు అజిత్ అయితే. ఆహా ఆ కాంబినేషన్ పీక్స్ అంతే. అలాంటి కాంబినేషన్ ను ఊహిస్తేనే అభిమానుల ఒళ్ళు పులకరిస్తుంది కానీ ఆ వెంటనే అసలు ఇది జరిగే పనేనా? అన్న అనుమానం కూడా వస్తుంది.

ఇదే ప్రశ్నను లండన్ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ను ఓ అభిమాని అడిగ్గా దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా..? ‘ఇప్పటి వరకూ ఇలాంటి ప్రపోజల్ నా దగ్గరకు రాలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఎవరైన మంచి కథతో వస్తే అజిత్ కలిసి తప్పక నటిస్తా’ అన్నారు. ఈ మాటతో అభిమానులు తెగ పొంగిపోయారు. ఈ హాట్ వార్త వినగానే సినీ ప్రముఖులు కొందరు ఇప్పటికే ఆ మల్టీ స్టారర్ గురించి చర్చల్లో కూడా మొదలుపెట్టేసి ఉండవచ్చు.