రాజకీయాలు, సినిమాలపై పవన్ సంచనలన వ్యాఖ్యలు..!

Sunday, April 10th, 2016, 05:55:43 PM IST

JANA
పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ ఉగాది సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదయ్యాక పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ ప్రముఖ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, రాజకీయాల గురించి పవన్ కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. సినిమాల విషయంలో తన స్టైల్ లో తాను పనిచేసుకుంటూ పోతానని పవన్ చెప్పారు. దర్శకత్వం విషయంలో కూడా తల దూర్చనని.. తన అనుభవంతో మాత్రమే సలహాలు సూచనలు ఇస్తానని పవన్ తెలిపారు. సామాజిక అంశంతో కూడిన చిత్రం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. అయితే, ఎక్కువ సినిమాలు చేయలేనని పూర్తిస్థాయి రాజకీయాలలోకి వస్తే .. తాను చెప్పినట్టుగానే సినిమాలు వదిలేస్తానని పవన్ పేర్కొన్నారు.

ఇక రిజర్వేషన్ విషయం గురించి మాట్లాడితే.. కులం అంటున్నారని పవన్ అన్నారు. 2019 ఎన్నికలలో జనసేన పోటి చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మర్చిపోలేదని అన్నారు. తాను ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉంటానని, వెనక్కి తీసుకోనని చెప్పారు. ఇకపోతే, రాజకీయాలలో విమర్శించేవారు ఉంటారని దానికి సిద్ధమయ్యే రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం హామీ ఇచ్చిందని.. కేంద్రం చేతులు ఎత్తేస్తే మాత్రం తాను హోదాకోసం పోరాటం చేస్తానని చెప్పారు.