50లక్షలు విరాళం ఇచ్చిన పవన్

Tuesday, October 14th, 2014, 02:35:02 PM IST


ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రను కుదిపేసిన హుధుద్ తుఫాను బాధితులకు 50లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. కాగా ఈ చెక్కును పవన్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందచేస్తానని వివరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాలలో త్వరలోనే పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే తుఫాను సహాయక చర్యల్లో తన అభిమానులు పాలుపంచుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.