టీఆర్ఎస్ ‘పవన్ కళ్యాణ్’ ను రెచ్చగోట్టిందా..?

Tuesday, January 12th, 2016, 03:46:12 AM IST

pk2
నిన్న మొన్నటి వరకూ టీడీపీ కార్యకర్తలు, అగ్ర నేతలు గ్రేటర్లో ఎన్నికల ప్రచారానికి రమ్మని పిలిచినా సమాధానం చెప్పకుండా మౌనం వహించిన పవన్ మొన్నీ మధ్య టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన విమర్శలకు సమాధానం చెప్పడానికి ఎన్నికల ప్రచారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. మొన్నీ మధ్య ఎంపీ కవిత మాట్లాడుతూ ‘కొంచెం తిక్కున్న పవన్ కు కేసీఆర్ ఎప్పుడో చుక్కలు చూపించారు. మేకప్ తో ప్రచారానికి వచ్చే పవన్ ఎన్నికల తరువాత ప్యాకప్ చెప్పాల్సిందే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

దీంతో పవన్ కళ్యాణ్ ‘ఇప్పుడు ప్రచారంలోకి దిగకపొతే అందరిలాగే తానూ కేసీఆర్ కు భయపడ్డానని అనుకుంటారు. పైగా ఆస్తులను కాపాడుకోవటానికే టీఆర్ఎస్ ను విమర్శించటం లేదన్న పుకార్లూ పుడతాయి. గనుక తాను ప్రచారంలోకి దిగి టీఆర్ఎస్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పి తీరాలి’ అని నిర్ణయించుకున్నట్లు.. ఇప్పటికే టీడీపీ – బీజేపీ అదిష్టానాలకు తన ప్రచారం గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.