ఎడప్పాడి పందెం కోడి..పళనిస్వామి..!

Thursday, February 16th, 2017, 04:00:22 PM IST


పన్నీర్ సెల్వం.. శశికళ కు ఎదురు తిరిగి అన్నా డీఎంకే పార్టీలో చీలికకి కారణమయ్యారు. దీనితో శశికళ వర్గం, పన్నీర్ వర్గంగా అన్నా డీఎంకే పార్టీ చీలిపోయింది. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్, శశికళ మధ్య వార్ జరుగుతున్న సమయంలో సుప్రీం కోర్టు జయ అక్రస్తుల కేసులో శశికళని దోషిగా తేల్చి ఆమెకు జైలు శిక్ష విధించింది. శశికళ కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారడంతో ఆమె విధేయుడు పళనిస్వామిని అన్నా డీఎంకే పార్టీ శాసన సభా పక్ష నేతగా నియమించింది. ఇలా అనూహ్యంగా సీన్లోకి వచ్చారు పళని స్వామి. ఈయన సేలం జిల్లాలోని సిరువన్ పాలెంలో ఓ రైతు కుటుంబంలో జన్మించారు.ఎంజీఆర్ మరణం తరువాత అన్నా డీఎంకే పార్టీలో చీలిక ఏర్పడినపుడు పళనిస్వామి జయలలిత వైపు నిలిచారు.1989లో తొలిసారి జయలలిత వర్గం నుంచి కోడిపుంజు గుర్తుపై ఎడప్పాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు.

ఆ తరువాత కూడా పళనిస్వామి 1991, 2011, 2016 లలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2011 లో జయలలిత కేబినెట్ లో రహదారుల శాఖా మంత్రిగా, 2016 లో ప్రజాపనుల శాఖ మంత్రిగా పళనిస్వామి నియమితులయ్యారు. కాగా పళని స్వామి జయలలిత మరణానంతరమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. పాలని స్వామిని ముఖ్యమంత్రి చేయడానికి శశికళ అప్పట్లో ప్రయత్నించింది. కానీ శాసన సభలో ఏకాభిప్రాయం కుదరదన్న భావనతో పన్నీర్ సెల్వంని నియమించారు. కాగా శశికళ అనూహ్యంగా జైలు పాలు కావడంతో పళని స్వామికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది.