ప్రధాని మోడీకి షాక్ ఇచ్చిన పాక్ ఈదీ ఫౌండేషన్?

Wednesday, October 28th, 2015, 03:30:09 AM IST

modi-and-geetha
15 ఏళ్ళ కిందట భారత్ నుంచి పాక్ కు వెళ్ళిన మూగ, చెవిటి బాలిక గీతను పాకిస్థాన్ లోని ఈదీ ఫౌండేషన్ అక్కున చేర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే గీత తల్లిదండ్రుల ఆచూకీ కోసం ఎంతగానో ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తామే గీత తల్లిదండ్రులమంటూ పలువురు ముందుకొచ్చారు.

ఈ నేపధ్యంలో ఈదీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ కుటుంబ సభ్యులు తాజాగా గీతను భారత్ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశం జరగగా, ఈదీ ఫౌండేషన్ కు మోదీ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అయితే, దీనికి ధన్యవాదాలు తెలిపిన ఫాదర్ థెరిస్సాగా పేరుగాంచిన అబ్దుల్ సత్తార్ ఈదీ.. తమ ఫౌండేషన్ విరాళాలకు వ్యతిరేకమంటూ మోడీ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారు. ఈ సందర్భంగా 1951లో పాక్ లోని కరాచీలో ఏర్పడిన ఈదీ ఇప్పటివరకు ఎవరి నుంచి విరాళాలు సేకరించలేదంటూ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.