రామోజీరావుకు పద్మవిభూషణ్.. రాజమౌళికి పద్మ శ్రీ

Monday, January 25th, 2016, 11:40:42 AM IST

ramojirao
రేపు జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా భారత్ ప్రభుత్వం వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో సినీ పరిశ్రమ నుండి పలువురు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అవార్డులను పొందారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ను పద్మ విభూషణ్ వరించింది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుండి నిర్మాత, రామోజీ ఫిలిం సిటీ, ఈ టీవీ అధినేత రామోజీ రావు కూడా పద్మ విభూషణ్ ను పొందారు. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి భారత ప్రభుత్వం పద్మ శ్రీ ప్రకటించింది. అలాగే బాలీవుడ్ పరిశ్రమ నుండి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా పద్మ విభూషణ్ పొందారు. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైంది.