స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఏమైంది..?

Thursday, December 24th, 2015, 03:40:17 AM IST

ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై వైసీపీ ఎమ్మెల్యేలు ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో మొత్తం 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కలిసి తీర్మానం పై సంతకాలు చేసి అసెంబ్లీ సెక్రెటరీ సత్యనారాయణకు అందించారు. దానితో పాటు డిసెంబర్ 18న జరిగిన అసెంబ్లీ సమావేశాల వీడియో ఫుటేజ్ లను కూడా ఆయనకు అందించారు.

స్పీకర్ అదికార పక్ష నేత కావటం వలన వాళ్ళ వైపు పక్షపాతం చూపుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని.. ఈ సస్పెన్షన్ పై సభ జరగాలని వారు ఆయన్ను డిమాండ్ చేశారు. ఒకసారి స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టినతరువాత 14 రోజుల లోపూ ఆయన నుండి వివరణ రావాలి. అలాగే రెండు రోజుల పాటు సభలో చర్చ జరగాలి. ఒకవేళ చర్చల్లో మెజారిటీ సభ్యులు గనక అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే స్పీకర్ తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.