భారత్ సహాయం కోరనున్న ఒబామా

Wednesday, September 24th, 2014, 01:21:38 PM IST


ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులపై అమెరికా సోమవారం నుంచి గగనతల దాడులు చేస్తున్నది. అమెరికాకు దాదాపు 40 దేశాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ దాడులకు సహకరిస్తున్నాయి. సిరియాలో బ్రిటన్ దేశానికి చెందిన జర్నలిస్టులను హతమార్చడంతో అమెరికా ఈ దాడులకు పూనుకున్నది. అయితే, ఇప్పటికే అమెరికా.. దాని మిత్రదేశాల మద్దతు కుదగట్టిన విషయం తెలిసిందే. అరబ్ దేశాలు కూడా సిరియా, ఇరాక్ దేశాలలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు, తమ భూభాగాలను వాడుకునేందుకు అమెరికాకు అనుమతి ఇచ్చాయి. పాకిస్తాన్ గురించి ఇక చెప్పవలసిన అవసరం లేదు.. పాకిస్తాన్ అమెరికాకు మిత్రదేశమే.. కాదనే అవకాశం లేదు..

మధ్యఆసియా దేశాలలో మరో బలమైన దేశం.. భారత్.. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో భారత్ దూసుకుపోతున్నది. అమెరికా కన్ను ఇప్పుడు భారత్ పై పడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్న అమెరికాకు సహకరించాలని అమెరికా కోరుతున్నది. ఈ విషయంపై భారత ప్రధానితో సెప్టెంబర్ 29న అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో జరిగే.. సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా, ఏదోఒక విధంగా అమెరికాకు సహకరించాలని ఒబామా భారత్ ను కోరనున్నారు.

అమెరికా సిరియా, ఇరాక్ దేశాలపై దాడులు చేస్తే. దాని ప్రభావం భారత్ పై తప్పకుండా పడుతుంది. దిగివస్తున్న ఆయిల్ ధరలకు మరలా రెక్కలొచ్చె అవకాశం ఉన్నది. ముడిచమురు ధర ఇప్పుడున్న ధరకు ఒక్క డాలర్ పెరిగినా.. భారత్ పై వేలకోట్ల రూపాయల భారం పడుతుంది.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని.. ఒబామాతో జరిగే సమావేశంలో మోడీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని భావిద్దాం..