చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ఊహించ‌ని స్ట్రోక్.. వైసీపీలోకి ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు..?

Thursday, February 14th, 2019, 07:31:41 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ టాప్‌గేర్‌లో దూసుకుపోతుంది. అప్ప‌టికే నిత్యం ప‌లు కార్య‌క్ర‌మాలో ప్ర‌జాక్షేత్రంలో బిజీగా గ‌డుపుతోంది వైసీపీ. ఇక అభ్య‌ర్ధుల ఎంపిక‌లో కూడా వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మార్చి మొద‌టి వారం క‌ల్లా అభ్య‌ర్ధుల తొలి జాబితాను సిద్ధం చేయ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తోంది. ఈ విష‌యాన్ని ప‌లు జాతీయ స‌ర్వేలు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లువురు నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ సిట్టింగ్ నేత‌లు, ఇత‌ర పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, కీల‌క నేత‌లు వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే.

అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుండి తాము ఆశించిన‌ టిక్కెట్ క‌ష్ట‌మ‌ని భావించిన, వంగవీటి రాధా, ఘ‌ట్ట‌మ‌నేని శేష‌గిరిరావు లాంటి వారు వైసీపీని వీడారు. అయితే తాజా సెన్షేష‌న్ మ్యాట‌ర్ ఏంటంటే స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరా తార‌క రామారావు పెద్ద‌ళ్ళుడు దాస‌రి జైర‌మేష్ వైసీపీలో చేరుతున్నార‌నే వార్త రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

ఇప్ప‌టికే ఎన్టీఆర్ అల్లుడైన ద‌గ్గ‌బాటి వెంక‌టేశ్వ‌ర రావు, అయ‌న త‌న‌యుడు చెంచురామ్ వైసీపీలో చేరుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పెద్ద‌ళ్ళుడు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో వైసీపీకి మ‌రింత క‌లిసి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిగిపోయాయ‌ని ,దాస‌రి జై ర‌మేష్‌కు విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. ఇక నిజంగానే ఎన్టీఆర్ పెద్ద‌ళ్ళుడు కూడా వైసీపీలో చేరితే చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాకే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.