మాకు కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలి!

Wednesday, July 25th, 2018, 05:57:06 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశంలో వివిధ ప్రాంతాల వారు కూడా ప్రత్యేక రాష్ట్రం తమకు కూడా కావాలని పోరాటం చేశారు. కాని ఎవరు కూడా అందుకు సరైన ప్రతిఫలాన్ని పొందలేదు. కేంద్రం చాలా వరకు అలాంటి సమస్యలు పెద్దవి కాకుండా జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు మరికొందరు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నడుం బిగించినట్లు తెలుస్తోంది. కర్ణాటక రెండుగా చీలిపోయే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ఏఎన్ఐ తెలిపిన కథనం ప్రకారం. కర్ణాటకలోని ఉత్తర ప్రాంత జిల్లా వాసులు ఎప్పటి నుంచో ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నట్లు కొందరు రాజకీయనాయకులు చాలా స్టార్లు చెప్పారు. అయితే వారు చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఉత్తర కర్ణాటక హోరాట సమితి ప్రత్యేక రాష్ట్రానికి పిలుపునిచ్చింది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్న 13 జిల్లాలను కలిపి నూతన రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఈ పోరాటానికి మద్దతు పలకాలని ఆగస్టు 2న బంద్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.