ప్రధాని మోడీకి నోబెల్ శాంతి బహుమతి..?

Sunday, December 27th, 2015, 08:50:26 PM IST


దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే పాకిస్థాన్ లో పర్యటించి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక మోడీ లాహోర్ పర్యటనపై అమెరికా, చైనా, ఐక్యరాజ్యసమితి అనేక దేశాలు ప్రశంసలు కురిపించిన విషయం కూడా తెలిసిందే. అయితే, ఇక్కడ కాంగ్రెస్ మాత్రం మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీకి నోబెల్ శాంతి బహుమతి సాధించాలనే పిచ్చి పట్టిందని, నోబెల్ శాంతి అనే దోమ నరేంద్ర మోడీని కుట్టిందని విమర్శించారు. అలాగే మోడీ కంటే ముందు నోబెల్ శాంతి అనే దోమ నవాజ్ షరీఫ్ ను కుట్టిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మోడీ ఆకస్మిక లాహోర్ పర్యటనతో ఏం సాధించారని, ఇద్దరు ప్రధానులు ఏం చర్చించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.