ప్రియాంక అందుకే భయపడుతోందా?

Wednesday, February 18th, 2015, 07:34:19 PM IST

priyanka
ప్రముఖ బాలీవుడ్ నటీమణి ప్రియాంకా చోప్రాకు అబ్బాయిలతో స్నేహమంటే మహా భయమట. అయితే అందుకు కారణం కూడా ఆమె వివరించారు. ఇక వివరాలలోకి వెళితే ప్రియాంక సినిమాలలోకి రాకముందు ఆమెకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడట. అయితే అతనిలో ప్రియాంక ఒక మంచి ఫ్రెండ్ ని చూస్తే అతను మాత్రం ప్రియాంకను ప్రేయసిలా చూసాడట. ఇక ఒక శుభ ముహూర్తం చూసుకుని సదరు స్నేహితుడు ప్రియాంకకు ప్రపోస్ చేసేసాడు.

అయితే ఈ హఠాత్పరిణామానికి మన బాలీవుడ్ ముద్దుగుమ్మ షాక్ కు గురైందట. ఇక ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడం చాలా కష్టమని, మంచి స్నేహితుడిని కోల్పోతున్నాననే బాధను భరించడం మాటలు కాదని ప్రియాంక చెప్పుకొచ్చింది. అలాగే అతనితో జీవితాంతం స్నేహంగా ఉందామనుకున్నానని, కానీ ఎప్పుడైతే అతని ప్రేమను తిరస్కరించానో అప్పుడే అతను తనకు దూరమయ్యాడని ప్రియాంకా చోప్రా ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అప్పటి నుండి మాత్రం అబ్బాయిలతో స్నేహం చెయ్యాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రియాంకా చోప్రా వివరించింది.