విప్రో సంస్థకు బీబీఎంపీ నోటిసులు

Friday, November 29th, 2013, 04:31:36 PM IST

wipro
భారతదేశంలో పెద్ద కంపెనీలలో మూడవదైన విప్రో సంస్థ భారీగా ఆస్థి పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. బృహత్ బెంగుళూరు మహానగర సంస్థ (బీబీఎంపీ) చెబుతున్న సమాచారం ప్రకారం విప్రో సంస్థ తమకు రూ. 16. 47 కోట్ల ఆస్థి పన్ను చెల్లించాల్సి ఉందని తెలియజేసింది. అయితే దీనిపై ఇప్పటికే సంస్థకు రెండు సార్లు నోటిసులు పంపించమని ఇప్పుడు మరిసారి కూడా నోటిసులు జారి చేశామని చెప్పారు. అయితే ఈ సారి గనుక విప్రో సంస్థ స్పందించకపోతే సంస్థ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే విప్రో సంస్థ ఆస్తులను సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని బీబీఎంపీ పన్నుల, ఆర్ధిక విభాగం చైర్మన్ ఎంఎస్ శివప్రసాద్ అన్నారు.

అయితే దీనిపై విప్రో సంస్థ మాత్రం తమకు బీబీఎంపీ ఎటువంటి నోటిసులు పంపలేదని బీబీఎంపీ అధికారులు తమ సంస్థలపై దాడులు చేసి తమని భయ పెట్టాలని చూస్తున్నట్టు వారు తెలియజేశారు. అయితే తాము కూడా బీబీఎంసీపై న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్టు విప్రో సంస్థ అధికారులు తెలియజేశారు.