చీర గురించి చెండాలంగా రాశారు..మీడియా సంస్థ పరువు మటాష్..!

Wednesday, November 1st, 2017, 02:00:19 AM IST

భారతీయ సంప్రదాయాలని విదేశీయులు సైతం శభాష్ అంటుంటే.. కొందరి పాశ్చాత్త పోకడలవలన మన ప్రతిష్టని మనమే దిగజార్చుకుంటున్నాం. ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన ఓ మీడియా సంస్థ భర్త నారి ధరించే చీర గురించి చెండాలమైన రాతలు రాసి అడ్డంగా పరువు పోగొట్టుకుంది. నెటిజన్లు, ప్రముఖులు ఆ సంస్థపై ఓ రేంజ్లో మండి పడుతున్నారు. స్త్రీలు చీర ధరించి ఆఫీస్ కు వెళితే పడరాని పాట్లు పడాల్సి వస్తుందని చెబుతూ ఓ వీడియో రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ వీడియో ప్రకారం స్త్రీలు చీర ధరించి ఆఫీస్ కు వెళ్తే మెట్లు ఎక్కలేరట. అందరూ పెళ్లయిందా అని అడుగుతారట. పైగా అంటి అని సంభోదిస్తారట. కనీసం టాయిలెట్ కు కూడా స్త్రీలు చీరలో సౌకర్య వంతంగా వెళ్లలేరని పిచ్చి రాతలు రాసింది. భారతీయ సంప్రదాయాలని కించ పరిచే విధంగా ఉన్న ఈ కంటెంట్ పై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

సెన్సేషన్ కోసం మీడియా సంస్థ ఈ స్థాయికి దిగజారిపోయిందా అని కొందరు విమర్శిస్తుంటే, ఇలాంటి వాంతులు పుట్టించే వార్తలు వేయొద్దని మరికొందరు మండి పడుతున్నారు. చీర విశిష్టత గురించి తెలియని అజ్ఞానులే ఈ పని చేసి ఉంటారని అంటున్నారు. ఇందిరమ్మ చీర కట్టుతోనే దేశాన్ని పాలించింది. ఝాన్సీ లక్ష్మి భాయ్ చీర కట్టుతోనే కదన రంగంలోకి దూకింది. అలాంటిది చీర కట్టుకుని ఆఫీస్ ఆఫీస్ కు వెళితే అంత కష్టమా అంటూ ఆ మీడియా సంస్థని ఆడేసుకుంటుంటారు. ఇతర దుస్తులు ధరించే వారిపై ఎలాంటి బలవంతం లేదు.. కానీ భారతీయ సంప్రదాయాలు మంటగలిపేలా నీచమైన పనులు చేయవద్దని నెటిజన్లు వార్నింగ్ ఇస్తున్నారు.