ఫ్యాష‌న్ డిజైన‌ర్ క్రియేటివ్ థాట్‌

Tuesday, September 4th, 2018, 03:59:18 AM IST

కేర‌ళ‌ వ‌ర‌ద‌ల్లో వంద‌లాది ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయ్‌. వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. ఇప్పుడిప్పుడే కేర‌ళ కోలుకుంటున్నా.. తీర‌ని న‌ష్టం జ‌రిగింది. వందేళ్ల‌లో ఎన్న‌డూ చూడ‌ని విప‌త్తు ఇది. అందుకే ఇరుగుపొరుగు నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఏకంగా 100 కోట్ల మేర నిధి చేరింది.

అదంతా ఓ కోణం అనుకుంటే, ఈ వ‌ర‌ద‌ల్ని క్రియేటివ్ కోణంలో చూపించారు ప్ర‌ఖ్యాత ఫ్యాష‌న్ డిజైన‌ర్ నీతా లుల్లా. ఓ అంద‌మైన స్కెచ్ ద్వారా త‌న‌లోని సృజ‌నాత్మ‌క‌త‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. నీట మునిగిన రాష్ట్రాన్ని ఆదుకునే ఆప‌న్న హ‌స్తం! అనే అర్థం వ‌చ్చేలా ఓ క్రియేటివ్ స్కెచ్ వేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతోంది.