ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో నరేంద్రమోడీ

Wednesday, November 20th, 2013, 11:13:55 AM IST

ఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేయాలని ఇంటలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మోడీ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నారని ఆయనకు ప్రధాని స్థాయి భద్రత కల్పించాలని బీజేపీ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ బీజేపీ ప్రతిపాదనని తోసిపుచ్చుతూ వచ్చింది. మోడీకి అంత హెవీ సెక్యురిటీ అక్కర్లేదంటూ షిండే కూడా వ్యాఖ్యానించారు.

అయితే మోడీ ఉగ్రవాదుల టార్గెట్ గా ఉన్నారని తేల్చి చెప్పిన నిఘా వర్గాలు గుజరాత్ సీఎంకి భద్రత కల్పించే విషయమై అనేక కీలక సూచనలు కూడా చేశాయ్.