హెరిటేజ్ ని బిలియన్ డాలర్ కంపెనీ చేస్తాం!

Saturday, January 24th, 2015, 11:20:43 PM IST

bramini
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, ప్రముఖ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె, టిడిపి యువ నేత నారా లోకేష్ భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెయిరీ విభాగంలో నాణ్యత, విశ్వసనీయత, అత్యున్నత ప్రమాణాల సాధనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అలాగే వచ్చే ఇదేళ్ళలో వన్ బిలియన్ డాలర్ (సుమారు 6వేల కోట్లు) ఆదాయాలు కలిగిన కంపెనీగా హెరిటేజ్ ఫుడ్స్ ను విస్తరించాలని భావిస్తున్నట్లు బ్రాహ్మణి పేర్కొన్నారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ ప్రస్తుతం హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో 90 రిటైల్ స్టోర్స్ నిర్వహిస్తున్నామని త్వరలో 200 స్టోర్లకు పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అలాగే భవిష్యత్తులో నిత్యావసర సరుకులు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు ఆన్ లైన్లో విక్రయించే అవకాశం ఉన్నందున త్వరలో తాము ఆన్ లైన్ విపణిలోకి ప్రవేశించనున్నామని బ్రాహ్మణి తెలిపారు. ఇక వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభిస్తామని బ్రాహ్మణి స్పష్టం చేశారు.