నాగార్జునకి పెద్ద కష్టం తప్పించిన నాగ చైతన్య, అఖిల్

Wednesday, June 29th, 2016, 10:15:16 PM IST


అటు సినీ పరిశ్రమ, ఇటు వ్యాపార రంగం రెండింటిలోనూ మంచి పేరు, పలుకుబడి ఉన్న కుటుంబం అక్కినేని కుటుంబం. ప్రస్తుతం అక్కినేని నట వారసులుగా మూడో తరం నటులు, నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇద్దరూ కూడా యంగ్ హీరోలే. కాబట్టి తండ్రిగా వాళ్ళని హీరోల్ని చేసైన నాగార్జునకు వాళ్ళకి పెళ్లిళ్లు కూడా చేయాల్సిన భాద్యత ఉంది. సాధారణంగా సెలబ్రిటీల పిల్లల పెళ్లంటే అబ్బో అదో పెద్ద ప్రక్రియ. తన ఇద్దరు కొడుకులకు మంచి సంబంధాలు చూడాలంటే నాగార్జునకు చాలా పెద్ద పని.

అందుకే నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా వాళ్ళ నాన్నకు సంబంధం వెతికే కష్టం లేకుండా ఎవరికి వల్లే తమ జోడీల్ని చూసేసుకున్నారు. పెద్ద కుమారుడు నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి అవుతుంటే అఖిల్ కూడా ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రేయా భూపాల్ తో ప్రేమలో ఉన్నాడు. పైగా నాగార్జున కూడా వీరి ప్రేమ పట్ల సుముఖంగా ఉన్నారు.