అరుణ‌క్క‌పై క‌విత‌క్క సెన్సేష‌న‌ల్ కామెంట్‌!!

Wednesday, November 2nd, 2016, 03:50:29 AM IST

kavitha-and-dk-aruna
గ‌ద్వాల్ రాణిగా పాపుల‌ర్ అయ్యారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ డీకే అరుణ‌. టీ-పాలిటిక్స్‌లో తేరాస ప్ర‌భుత్వాన్ని, కేసీఆర్ విధానాల్ని ఎండ‌గడుతూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న డీకే అరుణ త్వ‌ర‌లోనే పార్టీ మారుతార‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఎవ‌రైతే త‌న‌కు శ‌త్రువో ఆ శ‌త్రువే ఇప్పుడు త‌న‌కు చోటు ఇస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి డీకే అరుణ సీటు ఖాళీ అయిన‌ట్టే. త‌ను తొంద‌ర్లోనే తేరాస‌లో చేరిపోతున్నారంటూ విస్త్ర‌తంగా ముచ్చ‌ట‌ సాగుతోంది.

వాస్త‌వానికి ఇదివ‌ర‌కే ఈ ప్ర‌చారం సాగినా అప్ప‌ట్లో డీకే ఖండించారు. తాజాగా కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత చేసిన కామెంట్‌తో టీ పాలిటిక్స్ ఒక్క‌సారిగా హీటెక్కిపోయాయి. తొంద‌ర్లోనే అరుణ పార్టీ మారుతున్నారు. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైందంటూ హింట్ ఇచ్చి క‌విత టోట‌ల్ సీన్‌ని వేడెక్కించేశారు. ఇటీవ‌లే గ‌ద్వాల్ ప్ర‌త్యేక జిల్లా విష‌యంలో డీకే అరుణ అల‌క‌లు, విరుచుకుప‌డ‌డాలు, అటుపై త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. ఇదంతా చూసిన జనాల‌కు దిమ్మ తిరిగిపోయింది. అటుపై కేసీఆర్ గ‌ద్వాల్‌ని జిల్లాగా ప్ర‌క‌టించ‌డం వంటి కొత్త ప‌రిణామాల‌తో ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగాయి. అయితే డీకే అరుణ‌ను డిఫెన్స్‌లో ప‌డేసేందుకే క‌విత ఆ కామెంట్ చేశారా? అన్న కోణంలోనూ ఆలోచించాల్సి ఉంది.