భూమిపై మరో విచిత్రం .. మొసలిని మొసలే తినేసింది..!

Friday, April 15th, 2016, 03:01:51 AM IST


విచిత్రాలు.. వింత వింత సంఘటనలు మన భూమిపై తప్ప మరెక్కడా జరగవన్నది సత్యం. విచిత్రమైన సంఘటనలు ఇటీవల కాలంలో మరింతగా పెరిగిపోయాయి. పూర్వకాలంలో నరమాంసభక్షులు ఉండేవారని, వారు మనుషులను, జంతువులను వేటాడి రాక్షసుల్లా చంపి తినేవారు. కాలక్రమేనా ఆ జాతి అంతరించిపోయింది. ఇప్పుడు ఆధునిక మనిషి అవతరించాడు.

ఇక దీనిని పక్కన పెడితే.. ఆకలేస్తే.. పాము తన పిల్లలను చంపితినడం మనం చూశాం. అలాగే, కొండచిలువలు.. పాములను, ఇతర జంతువులను మింగేయడం చూశాం. కాని, ఒక మొసలి మరో మొసలిని చంపి తినడం ఇప్పటివరకు మనం చూడలేదు. ఇటువంటి అరుదైన, విచిత్రమైన సంఘటన ఫ్లోరిడాలో జరిగింది. 11 నుంచి 12 అడుగుల పొడవున్న మొసలి మరో చిన్న మొసలిని చంపి అమాంతం తినేసింది. మార్నింగ్ వాక్ కు వెళ్ళిన కొంతమంది ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించి యూట్యూబ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.