వేలానికి మోడీ 10లక్షల సూటు!

Wednesday, February 18th, 2015, 10:12:58 AM IST

modi
భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో ఆయనకు వచ్చిన బహుమతులను జాతీయ సంపదగా గుర్తించి, స్వచ్చ్ భారత్ నిధుల కోసం సూరత్ లో ఒక వేలం పాటను ఏర్పాటు చేశారు. కాగా నేటి నుండి మూడు రోజులపాటు జరిగే ఈ వేలంపాటలో ప్రధాని మోడీకి సంబంధించిన వస్తువులను వేలం వెయ్యనున్నారు. ఇక ఈ నేపధ్యంగా అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా ఇండియా పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ధరించిన సుమారు 10లక్షలు విలువ చేసే సూటును కూడా వేలంలో పెట్టనున్నారు.

కాగా ‘నరేంద్ర దామోదర్ దాస్ మోడీ’ అనే అక్షరాలు నిలువు గీతల్లా ఉండే ఈ బంద్ గలా సూటును మోడీ ధరించడంపై విపక్షాల విమర్శలను కూడా అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సూటును, మరియు మోడీకి ప్రధాని హోదాలో బహుమతులుగా లభించిన కొన్ని వస్తువులను ఈ సూరత్ వేలం పాటలో పెట్టనున్నట్లు నగర కమీషనర్ పేర్కొన్నారు. ఇక మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తరహా వేలంపాటలను ప్రారంభించారు.