మోడీ సూటు ధర 4.31కోట్లు!

Friday, February 20th, 2015, 07:50:36 PM IST

modi-suit
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధరించిన బంద్ గళా సూటును సూరత్ లో వేలానికి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పది లక్షల రూపాయలు పెట్టి కుట్టించిన ఈ సూటు ఇప్పుడు అక్షరాల 4.31కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక మూడు రోజుల పాటు జరిగిన ఈ వేలంపాటలో ఈ సూటు ధర 11లక్షల వద్ద నుండి మొదలై 4.31కోట్ల వద్ద ముగిసింది.

కాగా సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి పటేల్ ఈ సూటును దక్కించుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక ఈ సూటు వేలం ద్వారా వచ్చిన సొమ్మును ప్రధాని మోడీ స్వచ్చ్ భారత్ లో భాగంగా గంగా నది ప్రక్షాళనకు వినియోగించనున్నారు. అలాగే ఈ వేలంలో ప్రధానిగా మోడీ అధికారం చేపట్టినప్పటి నుండి అందుకున్న బహుమతులను కూడా పెట్టారు. కాగా సూటు అత్యధిక ధర 4.31కోట్ల రూపాయలకు అమ్ముడు కావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.