మోడీకి టెన్నీస్ రాకెట్లు బహుమతి

Friday, March 6th, 2015, 12:52:24 PM IST


భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇండియన్ టెన్నీస్ స్టార్ లియాండర్ పేస్, స్విస్ టెన్నీస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ఇద్దరూ ప్రధాని మోడీకి రెండు టెన్నీస్ రాకెట్ లను బహుమతిగా ఇచ్చారు. ఇక వీరిచ్చిన బహుమతిని అందుకున్న మోడీ అత్యంత సంతోషంతో ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. అలాగే ఆ టెన్నీస్ రాకెట్లకు ఒక విశిష్టత కుడా ఉందంట. అదేమిటంటే పేస్, హింగిస్ లు ప్రధాని బహుమతి చేసిన రాకెట్లను వారు ఆస్ట్రేలియా ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ ఆడేటప్పుడు వినియోగించారని మోడీ స్వయంగా తెలిపారు. ఇక రాకెట్ లపై పేస్, హింగిస్ లు సంతకాలు పెట్టి మరీ మోడీకి బహుమతిగా అందించారని సమాచారం.