పోప్ ఫ్రాన్సిస్ ను అధిగమించిన మోడీ!

Monday, February 2nd, 2015, 05:12:35 PM IST

modi
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘యూ-గవ్’ సంస్థ విడుదల చేసిన ‘ప్రపంచ అత్యంత ఆరాధ్య పురుషుడు’ జాబితాలో ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా ఈ జాబితాలో ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ అధిపతి బిల్ గేట్స్ ప్రధమ స్థానంలో నిలిచారు.ఇక అనంతరం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తర్వాత స్థానాలలో నిలిచారు. కాగా ప్రధాని మోడీ తర్వాత పోప్ ఫ్రాన్సిస్ ఆరవ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే ఫ్రాన్సిస్ తరువాత టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా ఏడవ స్థానంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 11వ స్థానంలో నిలిచారు. ఇక మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు ఈ జాబితాలో 14వ స్థానం దక్కింది. కాగా 23 దేశాలలో జరిపిన సర్వే ఆధారంగా ‘యూ-గవ్’ సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది.