భేటీ అద్భుతంగా జరిగింది!

Tuesday, September 30th, 2014, 11:41:49 AM IST


భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఇచ్చిన విందులో పాల్గొన్న మోడీ అనంతరం ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విషయాలను ప్రధాని మోడీ తాజాగా తన పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. ఇక అమెరికా అధ్యక్షుడు ఒబామాతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని మోడీ తన పేస్ బుక్ లో పేర్కొన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపామని మోడీ తెలిపారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఒబామా, తానూ రెండు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించామని వివరించారు. మొత్తం మానవాళికి మేలు జరిగేలా కలిసి పని చెయ్యాలని ఇరు దేశాలు నిర్ణయించాయని మోడీ తన పేస్ బుక్ ఖాతాలో ఒబామాతో సమావేశం విషయాలను పంచుకున్నారు.