కోహ్లీ ప్రపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్‌!

Monday, September 10th, 2018, 12:58:49 PM IST

రన్ మెషిన్, టీమిండియా సారధి విరాట్ కోహ్లీ అంటే ప్రపంచ క్రికెట్ దిగ్గజాలకు ఎంతో అభిమానం. కోహ్లీ తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా గొప్పదని తరచు ప్రశంసలు అందిస్తుంటారు. ఇక రికార్డులు బద్దలు కొట్టిన ప్రతిసారి సోషల్ మీడియాలో సీనియర్ క్రికెటర్స్ విరాట్ పై కొత్త తరహా బిరుదులు అందిస్తూ అభిమానులకు ఆకట్టుకుంటారు. కోహ్లీపై విమర్శలు చేసే సీనియర్ ప్లేయర్ల సంఖ్య చాలా తక్కువ. ఇక అందులో మైకేల్ వాగ్ కూడా నిలిచాడు. కోహ్లీ ఒక చెత్త సమీక్షకుడు అని చెప్పడం మీడియాలో వైరల్ గా మారింది.

కెప్టెన్ గా జట్టును విజయతీరాల్లో చేర్చడానికి టెస్ట్ ఫార్మాట్ లో డీఆర్‌ఎస్‌(డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) అనేది కీలకమైనది. కొన్ని సార్లు దురదృష్టవశాత్తు అంపైర్ల తప్పుడు నిర్ణయం మ్యాచ్ ఫలితాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఉన్న రివ్యూలను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కానీ కోహ్లీ ఇటీవల రివ్యూలా విషయంలో తీసుకున్న నిర్ణయాలు కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. అందుకు మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో వెంట వెంటనే డీఆర్‌ఎస్‌(డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) ఉపయోగం లేకుండా వృధా చేశాడు. జడేజా వేసిన 10వ ఓవర్‌, 12వ ఓవర్లలో రెండు సార్లు వెనువెంటనే కోహ్లీ రివ్యూ కోరడం వృధా అయ్యింది. అయితే కోహ్లీ ప్రపంచంలోనే మంచి బ్యాట్స్ మెన్ అయ్యి ఉండవచ్చు.. కానీ అతనే ఒక చెత్త రివ్యూయర్‌ అని మైకేల్‌ వాన్‌ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయపడ్డారు.