‘ఖైదీ నంబ‌ర్ 150’ రేటుకి క‌ళ్లు బైర్లు క‌మ్మాయ‌ట‌!

Friday, August 26th, 2016, 01:00:38 PM IST


మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ‘ఖైదీ నంబ‌ర్ 150’ పై భారీ అంచానాలే ఉన్నాయి. అయితే ఆ అంచ‌నాలు మ‌రీ భారీ స్థాయిలో ఉన్నాయ‌ని ఇప్పుడు కొంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్లు పెద‌వి విరుస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వ‌స్తున్న ‘ఖైదీ నంబ‌ర్ 150’ పై నిర్మాత రామ్ చ‌ర‌ణ్ భారీ నమ్మ‌కాన్ని పెట్టుకున్నాడ‌ట‌. అత‌ను న‌మ్మ‌కం పెట్టుకుంటే ఫ‌ర్వాలేదు కానీ సినిమాను కొనేందుకు వ‌స్తున్న డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అత‌ను చెప్తున్న రేటు విని చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని టాక్.

తాజాగా ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ ను కొనేందుకు ఓ డిస్ట్రిబ్యూట‌ర్ రామ్ చ‌ర‌ణ్ ను సంప్ర‌దించాడు. అయితే చ‌ర‌ణ్ చెప్పిన రేటు విని స‌ద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ షాక్ తిన్నాడ‌ట‌. ఓవ‌ర్సీస్ రైట్స్ ను రూ.15 కోట్ల‌కు త‌క్కువ‌కు అమ్మ‌న‌ని రామ్ చ‌ర‌ణ్ తేల్చిచెప్పేసాడ‌ట‌. ఆ డిస్ట్రిబ్యూట‌ర్ రూ.12 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చినా చెర్రీ స‌సేమిరా అన్నాడ‌ని టాక్. ర‌జ‌నీ కాంత్ ‘క‌బాలి’ ఓవ‌ర్సీస్ లో స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ భారీగా దెబ్బ‌తిన్నారు. ఇదే మాట చెప్పినా చ‌ర‌ణ్ విన‌లేద‌ట‌. రూ.15 కోట్లు అయితే మాట్లాడండి అని కరాఖండిగా చెప్పాడ‌ని మాట్లాడుకుంటున్నారు.