మైనారిటీలకు పెద్దపీటే వేశాం!

Monday, March 16th, 2015, 04:10:29 PM IST

ktr
తెలంగాణ ఐటి మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటిఅర్ అసెంబ్లీలో సోమవారం ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము తమ రెండు బడ్జెట్లలోను మైనారిటీల సంక్షేమానికి వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ నే కేటాయించామని స్పష్టం చేసారు. అలాగే టిపీపీఎస్సీ ద్వారా ముస్లింలకు న్యాయం చేస్తామని, ఆ కమీషన్ సభ్యుల్లో ఖాద్రీ ఒకరని కేటిఅర్ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పించేందుకు ఇప్పటికే ఒక కమీషన్ వేశామని తెలిపారు. అలాగే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణపై బాజిరెడ్డి నేతృత్వంలో సభా సంఘం వేశామని కేటిఅర్ పేర్కొన్నారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉద్యోగాల విషయంలో మైనారిటీలకు సరైన వాటా రాలేదని కేటిఅర్ వివరించారు.