ఒక్క ముద్దు రెండు సార్లు ప్రాణాలను కాపాడింది

Tuesday, November 17th, 2015, 05:52:08 PM IST

pop-kiss
ఓపక్క ఉగ్రవాదులు సృష్టిస్తున్న నరమేధం. మరోపక్క బుల్లెట్ తగిలి గిలగిలా కొట్టుకుంటున్న స్నేహితుడు. కేవలం 3మీటర్ల దూరంలో ఉగ్రవాదులున్నా అతగాడు తప్పించుకున్నాడు. అతని పేరే మస్సిమిలియానో నటలుక్సి. ఇతని కధ వింటే ఎవరైనా ‘వీడు ఎంత అదృష్టవంతుడు’ అని కితాబివ్వకుండా ఉండలేరు. తాజాగా బటక్లాన్ ధియేటర్లో శనివారం జరిగిన ఉగ్ర దాడి నుండి మస్సిమిలియానో నటలుక్సి త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ దాడిలో సుమారు 89మంది మరణించగా ఇతను మాత్రం చిన్న చిన్న గాట్లతో భయటపడ్డాడు.

మస్సిమిలియానో గతంలో కూడా ఒకసారి ఇదే తరహా ప్రమాదం నుండి చాలా విచిత్రంగా తప్పించుకున్నాడు. 30ఏళ్ల క్రితం మస్సిమిలియానో కు 15 సంవత్సరాల వయసున్నప్పుడు బ్రస్సెల్స్ లోని హేజెల్ స్టేడియంలో యూరోపియన్ కప్ ఫైనల్ మ్యాచ్ ను తన అంకుల్ తో కలిసి వీక్షిస్తున్నాడు. అప్పుడే వాళ్ళు కూర్చున్న ప్రదేశానికి వెనుక ఉన్న గోడ అమాంతం కూలి వాళ్ళ మీద పడింది. మస్సిమిలియానో చుట్టూ ఉన్న 39 మంది చనిపోయారు. కానీ మస్సిమిలియానో మాత్రం చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు.

ఇదే విషయం మస్సిమిలియానో సోదరి ఫెడెరికా ను అడగ్గా..తన సోదరుడు సరిగ్గా 8ఏళ్ల వయసులో రోమ్ నగరంలో పోప్ జాన్ పాల్-2ను కలవగా పోప్ అతనికి ముద్దు పెట్టాడని..ఆ ముద్దే తన సోదరుణ్ణి అదృష్టవంతుణ్ణి చేసి ఎన్ని
ప్రమాదాలెదురైనా కాపాడుతోందని తెలిపింది.