ఉద్యోగం పేరుతో యువతిని లోబర్చుకున్న మృగాడు !

Monday, February 26th, 2018, 04:26:06 PM IST

ఇటీవలి కాలం లో ఆడవారి మీద, అందునా ఎవరు లేని నిస్సహాయ ఆడవారి మీద లైంగిక దాడులుపెరిగాయి. అమాయకులైన ఆడవారిని వారి దీనస్థితిని తెలుసుకుని మోసగించే వ్యక్తుల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా వుండాలని నిపుణులు ఎంత చెపుతున్నా ఈ రకమైన లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తల్లిదండ్రులు చనిపోయి, తన అనుకునేవారు ఎవరూ లేకపోవడంతో బతుకుదెరువు కోసం కడప లోని ఓ దుస్తుల పరిశ్రమకు వెళ్లగా ఉద్యోగమిచ్చినట్లే ఇచ్చి ఆ సంస్థ యజమాని తనను భయపెట్టి శారీరకంగా లొంగదీసుకున్నాడని 19ఏళ్ల యువతి ఆరోపిస్తోంది.

ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆప్కో ఛైర్మన్‌ శ్రీనివాస్‌ తండ్రి రామకృష్ణ కడపలో దుస్తుల పరిశ్రమలు నిర్వహిస్తున్నారని, ఆ పరిశ్రమకు ఉద్యోగం కోసం నాలుగు నెలల కిందట వెళ్తే పనిలో చేర్చుకున్నారు. అయితే కొన్ని రోజులకు రామకృష్ణ ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించి బలవంతంగా లోబర్చుకున్నాడని ఆమె ఆరోపణ. ఆ తర్వాత ఆయనతో గడిపిన సందర్భాల్లో తీసిన వీడియోలను సోషల్ మీడియా లో పెడతానని బెదిరించి ఇతరుల వద్దకూ పంపించేవాదాని అంటోంది. ఆ హింస తట్టుకోలేక పలుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసాను అని వెల్లడించింది.

డిసెంబరులో కడప వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో తన బాధ చెప్పుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని ఆ యువతీ వాపోయింది. అక్కడ ఏఎస్‌ఐ తనతో ఓ తెల్లకాగితంపై సంతకం చేయించుకుని, రూ.50వేలు ఇస్తాం అవి తీసుకుని నోరు తెరవకుండా దీన్ని ఇక్కడితో వదిలేయమని బెదిరించారని అంటోంది. రామకృష్ణ తననే కాక అనేక మంది యువతులను లొంగదీసుకున్నట్లు తనకు తెలుసని, పొట్ట కూటికోసం ఉద్యోగం చేసే మహిళలను, నిస్సహాయులను ఈ విధంగా లోబర్చుకోవడం చేస్తున్నాడని ఆమె చెపుతోంది. ఇంత జరిగినప్పటికీ సదరు రామకృష్ణ మాత్రం ప్రభుత్వ అండ దండలతో నువ్వు దిక్కున్న చోట చెప్పుకో,

నాకు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అండ దండాలు వున్నాయి అని తనని బెదిరిస్తున్నాడని ,రామకృష్ణకు సంబంధించి తన దగ్గర వున్న వీడియోలను పత్రికా మిత్రులకు ఇస్తూ అతనికి కఠిన శిక్ష పడేలా చూడమని, సంఘంలోని ఇటువంటి చీడపురుగులు వదిలిపెట్టవద్దని అభ్యర్ధించింది….