ఆగడు విజయం కోసం మహేష్ ప్రార్ధన

Thursday, September 18th, 2014, 12:23:41 PM IST


ప్రముఖ టాలివుడ్ నటుడు మహేష్ బాబు అజ్మీర్ దర్గాను సందర్శించారు.ఖ్వాజా మోయినుద్దీన్ చస్తీ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. రేపు విడుదల కాబోయే ఆగడు సినిమా విజయం సాదించాలని మహేష్ బాబు ప్రార్ధించినట్టు తెలిపారు. బిజినెస్ మెన్, దూకుడు, నేనొక్కడినే సినిమాల విడుదలకు ముందు కూడా మహేష్ బాబు ఈ దర్గాను దర్శించి సినిమా విజయం కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేసిన విషయం తెలిసిందే. రేపు విడుదల కాబోయే ఆగడు సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ మహేష్ బాబు అజ్మీర్ దర్గాను దర్శించారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నది.