కేసీఆర్ కుటుంబం ఆ విషయంలో బాగా బలిసింది…!!

Saturday, November 5th, 2016, 02:55:58 AM IST

madhu-yaskhi
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్ కుటుంబం అవినీతి అంశంలో ఏనుగులా బాగా బలిసిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు మధు యాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనినీతి, రైతుల ఆత్మహత్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం నెం 1 గా ఉందన్నారు. కేటీఆర్ మంత్రి అయ్యాక తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

జూబ్లీ 800 పబ్ నిర్వాహకులకు మీకు సంబంధం ఏంటి ?అన్ని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మిషన్ భగీరథ లో ఎందుకు ఖర్చు చేస్తోంది..కమీషన్ల కోసమేనా?’ అని ప్రశ్నించారు. పేదల డబుల్ బెడ్‌రూంలకు డబ్బుల్లేవు కానీ..రూ. 50 కోట్లతో కేసీఆర్ ఇల్లు మాత్రం కట్టుకున్నారని అన్నారు. గ్రేటర్ లో జరిగిన అవినీతిపై తండ్రీ కొడుకులిద్దరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రూ.337 కోట్ల రోడ్ల నిర్మాణంలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. జీహెచ్‌ఎంసీ కుంభకోణంపై లోకాయుక్తలో కేసు వేయబోతున్నామన్నారు.