పెళ్ళికోసం ఖైదీకి బెయిల్..!

Tuesday, February 3rd, 2015, 01:08:26 PM IST


తమిళనాడు తిరువొత్తియురు లోని పుళన్ జైలులో బాంబు పేలుళ్ళ కేసులో శిక్ష అనుభవిస్తున్న అహ్మద్ కోవై కు మద్రాస్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. మాములుగా అయితే, అతనికి ఇచ్చిన బెయిల్ గురించి వార్తల్లోకి ఎక్కేది కాదు.. కాని, అది ఓ స్పెషల్ బెయిల్… బెయిల్ లో స్పెషల్ బెయిల్ ఏమిటని అనుకుంటున్నారా.. మరి ఆ స్పెషల్ ఏమిటో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నదా.. అయితే వివరాలలోకి వెళ్ళాల్సిందే.

అహ్మద్ కోవే అనే వ్యక్తీ గతంలో బాంబు పేలుళ్ళ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగ, కోయంబత్తూరుకు చెందిన ఫాతిమా అనే మహిళా తన కుమారుడికి ఈనెల 7న పెళ్ళిచేయాలని నిర్ణయించుకున్నామని, అందుకు అహ్మద్ కు 20రోజులపాటు బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్ట్ ను కోరింది. కాగ, ఆమె పిటిషన్ ను పరిశీలించిన హైకోర్ట్ ఆమె విజ్ఞప్తిని మన్నించి అహ్మద్ కు 20రోజుల బెయిల్ ను గ్రాంట్ చేసింది.