తిరిగొచ్చిన చినబాబు!

Friday, May 15th, 2015, 08:35:53 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఏపీకి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 3న అమెరికా వెళ్ళిన చినబాబు అక్కడ పారిశ్రామికవేత్తలతో పాటు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను కూడా కలిసి విజయవంతంగా తన పర్యటనను ముగించుకుని కొద్ది సేపటి క్రితం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు.

ఇక అమెరికా పర్యటన ముగించుకొచ్చిన లోకేష్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కాగా అమెరికాలో స్మార్ట్ విలేజెస్ పై లోకేష్ చేసిన ప్రసంగానికి ఆకర్షితులైన ఎన్ఆర్ఐలు 2,400 గ్రామాలను పైగా దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇక తన పర్యటనలో పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర గవర్నర్ లను కలిసిన లోకేష్ మంచి ఫలితాలనే రాబట్టగలిగారు.