సర్జికల్ దాడుల్లో చిరుతల సాయం కూడా ఉంది : బ్రిగేడ్‌ కమాండర్‌

Wednesday, September 12th, 2018, 07:52:31 PM IST

2016 భారత సైన్యం పాక్ కు మర్చిపోలేని కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై ఎవరు ఊహించని విధంగా సర్జికల్ స్ట్రైక్ పేరుతో అద్భుత సాహసం చేసి ఆపరేషన్ ను విజయవంతం చేశారు. అయితే ఈ ఆపరేషన్ లో ఎవరికీ తెలియని విషయాన్నీమాజీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేంద్ర నింబోర్కర్‌ వెల్లడించారు. చిరుత పులల సహాయం కూడా ఆపరేషన్ లో ఒక ముఖ్య భాగమని ఆయన తెలిపారు.

2016లో సైన్యం ఎంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్జికల్‌ దాడుల్లో పాల్గొన్నందున రాజేంద్ర నింబోర్కర్‌ సేవలను గౌరవిస్తూ పుణెకు చెందిన థార్లో బాజీరావ్‌ పేష్వీ ప్రతిష్ఠాన్‌ సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన దాడులలో రచించిన ప్రణాళికల గురించి ఆసక్తికరమైన విషయాలని తెలిపారు. ఈ ఆపరేషన్ లో శునకాల వల్ల ఇబ్బంది తప్పదని ముందుగా గ్రహించాం. సైనికులను చూసి అవి అరిచి దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే అవి పగటిపూట పులుల దాడులు చేస్తాయని శునకాలు బయటకు రావు. అందుకే రాత్రుళ్లు సంచరిస్తాయి. ముందుగానే కుక్కలు సంచరించే ప్రాంతాల పరిసరాలలో చిరుత పులుల మూత్రాలు చల్లాల్సి వచ్చింది. అది మంచి ఫలితాన్ని ఇచ్చింది. శునకాలు ఏవి కూడా మా దారికి అడ్డుగా రాలేవని అనంతరం సర్జికల్ దాడులను ఫాస్ట్ గా ఫినిష్ చేసినట్లు రాజేంద్ర వివరించారు.