బిగ్ బాస్ 2: క్యాష్ పార్టీలను కామన్ మ్యాన్ అంటారేంటి?

Tuesday, June 12th, 2018, 03:26:56 AM IST

ఈ ఏడాది నానితో బిగ్ బాస్ సెకండ్ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే కంటెస్టెంట్ ల విషయంలో మాత్రం అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. నానికి ఒక విధమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఎలాగూ వారానికి రెండు సార్లు నడిపించేస్తాడు. కానీ మిగతా రోజులు ఎలా నడుస్తుంది అన్నదే ఆసక్తిగా మారింది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే..

గీతా మాధురి (సింగర్)
అమిత్ తివారీ (నటుడు)
దీప్తి నల్లమోతు (టీవీ న్యూస్ రీడర్)
తనీష్ (నటుడు)
బాబు గోగినేని (హ్యూమనిస్ట్)
భాను శ్రీ (డాన్సర్)
రోల్ రైడర్ (రాపర్)
శ్యామల (యాంకర్)
కిరీటి దమరాజు (నటుడు)
దీప్తి సునైనా (డాన్సర్)
కౌషల్ (మోడల్)
తేజాస్వి మదివాడ (నటీమణి)
సామ్రాట్ రెడ్డి (నటుడు)
గణేష్ (కామన్ మ్యాన్)
సంజనా అన్నే (కామన్ లేడీ)
నూటన్ నాయుడు (కామన్ మ్యాన్)

ఇందులో గీత మదురు తనీష్ ఇతర యాక్టర్స్ అందరికి పరిచయమే.. ఇక బాబు గోగినేని న్యూస్ రీడర్ దీప్తి కూడా కొంత మందికి తెలుసు. ఇక మరికొంత మంది సోషల్ మీడియా స్టార్స్ ఈ సారి సోషల్ మీడియాలోకి రావడం మరొక స్పెషల్.

ఇక కామన్ జనతా అంటూ వచ్చిన ముగ్గురు సామాన్యుల్లో ఇద్దరు సెలెక్ట్ అయినా తీరు హాట్ టాపిక్ గా మారింది. వాళ్లని కామన్ జనతా అంటూ.. ఆహ్వానించడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇకపోతే వారిలో ముఖ్యంగా నూతన్ నాయుడు అనే వ్యక్తి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ బాగా ఉన్న వ్యక్తి ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి 2014లో స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తిలో ఒకరు. డబ్బులు బాగా ఖర్చుపెట్టారని ఓకే న్యూస్ ఉంది. ఆయన స్పీచ్ లు కూడా అప్పట్లో బాగానే ఇచ్చారు.

ఇక సంజన అన్నే అనే ఒక కామన్ లేడి కూడా ఫుల్ క్యాష్ పార్టీ అని తెలుస్తోంది. ఆమీ మోడల్ గా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు అందుకున్నారు. స్టేట్ లెవెల్లో కూడా కొన్ని అవార్డులు దక్కాయి. కానీ ఆమెను కామన్ లేడి క్యాటగిరిలో తీసుకురావడం వైరల్ అవుతోంది.