తస్సాచక్క.. ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు కేటీఆర్

Saturday, May 21st, 2016, 12:55:16 AM IST


హైదరాబాద్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ వ్యక్తికైనా ముందుగా గుర్తొచ్చేది పెద్ద సాఫ్ట్ వేర్ బిల్డింగులు, లక్షల్లో జీతాలు. దేశ నలుమూల నుండి రాష్ట్రానికి వచ్చే యువత కూడా ఇవే కలలతో ఇక్కడికి వస్తుంది. దీంతో ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఉన్న జనాభాలో ఎక్కువశాతం మంది యువత ఐటీ రంగం మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. పైగా నగర ఆదాయంలో కూడా ప్రధాన వాటా ఐటీ రంగానిదే. కాబట్టి ఐటీ ప్రజల మద్దత్తు ఎవరికుంటే ఆ పార్టీనే రాష్ట్రంలో కూడా చక్రం తిప్పగలదన్నది కాళ్ళ ముందు కనిపించే వాస్తవం.

సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నాడు తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్. అందుకే సైబర్ సిటీ మీద చెక్కబడ్డ చంద్రబాబు పేరును తుడిచేసి తమ పేరు లిఖించడానికి ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను నగరంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఎంఎస్ వంటి కంపెనీలతో పాటు తాజాగా యాపిల్ సంస్థను కూడా హైదరాబాద్ గడ్డ మీదికి తీసుకొచ్చేసి ఐటీ జనాల మన్ననలను అందుకుంటున్నాడు. దీంతో అందరూ అబ్బా సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు కేటీఆర్ అనుకుంటున్నారు.