కేటిఆర్ మెచ్చిన హీరో ఇతనే..!

Wednesday, May 11th, 2016, 11:46:37 AM IST


తమిళ హీరో సూర్య నటించిన 24 సినిమా ఇటీవలే విడుదలైంది. టైం ఆధారంగా నడిచే ఈ సినిమాకు విక్రం కుమార్ దర్శకత్వం వహించారు. విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాను తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా తిలకించారు. 24 లో సూర్య నటనకు ఫిదా అయినట్టు కేటిఆర్ సినిమా అనంతరం మీడియాతో పేర్కొన్నారు. తనకు సినిమా చూడటం ఒక ఫ్యాషన్ అని, నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే తనకు సినిమా అన్నది రిలీఫ్ ఇస్తుందని కేటిఆర్ పేర్కొన్నారు.