నా యాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తా.. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తా

Friday, February 19th, 2016, 04:19:02 PM IST


పురపాలక శాఖా మంత్రిగా భాద్యతలను చేపట్టిన కేటీఆర్ సరికొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నారు. తాజాగా గ్రేటర్ పరిదిలో 100 రోజుల ప్రణాలికను ప్రవేశపెట్టాలని సంకల్పించారు. దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన ‘ రాబోయే వంద రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్ళేలా ప్రణాళికను రచించాము. జూన్ మొదటి కల్లా అనుకున్నవి అనుకున్నట్టు పూర్తి చేస్తాము. ఈ వంద రోజుల్లో నా యాక్షన్ ఎలా ఉండబోతోందో మీరే చూస్తారు. అవసరమైతే కొన్ని చోట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తా’ అన్నారు.

కేటీఆర్ ప్రకటించిన ప్రణాళికలో ప్రధానంగా 200 కొట్లతో 569 బీటీ రోడ్ల నిర్మాణం, 30 కోట్లతో నాలాల అభివృద్ధి, 10 కోట్లతో స్మశానవాటికల పునరుద్దరణ, 26 కోట్లతో 40 మాడరన్ మార్కెట్లు, 150 జిమ్ సెంటర్లు 329 స్పోర్ట్స్ గ్రౌండ్లు, 20 కాలనీల్లో పార్కుల అభివృద్ధి వంటివి ఉన్నాయి. గెలిచిన తక్షణమే
కేటీఆర్ ప్రణాళిక రచించి పనిలోకి దిగడంతో అందరూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.