ఖమ్మం.. వరంగల్ లోను అదే స్పీడ్..!

Wednesday, March 9th, 2016, 08:45:14 AM IST

CAR
ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కు అలాగే అచ్చంపేట నగర పంచాయితీకి ఆదివారం రోజున ఎన్నికలు జరిగాయి. కాగా, ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఖమ్మంలో 50, వరంగల్ లో 58 కార్పోరేషన్లు, అచ్చంపేటలో 20 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ఇక అచ్చంపేటలో మనకు అందిన సమాచారం ప్రకారం టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. 20 వార్డులలో 20 కూడా టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.

ఇక ప్రస్తుతానికి ఖమ్మం, వరంగల్ లలో కూడా కారు అదే స్పీడ్ ను పెంచింది. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ జరుగుతున్నది. మరో రెండు మూడు గంటలలో అక్కడ ఫలితాలు కూడా వస్తాయని తెలుస్తున్నది.