ఖమ్మం ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ ముచ్చటైన ప్రసంగం

Wednesday, April 27th, 2016, 11:50:33 PM IST


టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ వినోత్సవం సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్లీనరీ సమావేశాన్ని ఖమ్మంలో ఏర్పాటు చేశారు. పైగా త్వరలో పాలేరు నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు రానుండటంతో ఈ సమావేశం పార్టీకి అనుకూలమవుతుందనే ఉద్దేశ్యం కూడా పార్టీ పెద్దల్లో లేకపోలేదు.

ప్లీనరీ మీటింగ్ సందర్బంగా సభలో మాట్లాడిన కేసీఆర్ పార్టీ అవిర్భావం నాటి తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అలాగే అధికారం వచ్చినా కూడా తమ పార్టీ ఏమాత్రం గొప్పలకు పోకుండా తెలంగాణా అభివృద్ధి కొరకు అహర్నిసలూ పాటుపడుతోందని గుర్తుచేశారు. అలాగే ఎన్నికల సమయంలో పార్టీ ఇవ్వని పనులను సైతం చేస్తోందని అన్నారు. ప్రజలే తమ బాసులని పెదాల్ క్షేమం కోసం 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కూడా తెలిపారు. అలాగే సొంత ఇళ్ళు లేనివారి కోసం తమ పార్టీ చెపడుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం గురించి ప్రత్యకంగా ప్రస్తావించిన ఆయన ఖమ్మం వాసులను తన ప్రసంగ్తో మంత్రముగ్దుల్ని చేశారు.