టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా కెసిఆర్ ఎన్నిక

Sunday, May 18th, 2014, 03:55:47 AM IST


రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి తెలంగాణ లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దాదాపు ప్రభుత్వ ఏర్పాటు కు కావలసిన 63 స్దానాలను గెలుచుకుంది. శనివారం రోజు ఎన్నికల్లో గెలిచిన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్దులతో ఆ పార్టీ అధినేత కెసిఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ లో కెసిఆర్ ను టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్, కేశవరావు లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా కెసిఆర్ పేరును రాజయ్య ప్రతిపాదించగా సభ్యులు ఆయన్ను ఎన్నుకున్నారు. కాగా గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్ సభ స్దానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ జూన్ 2 నుంచి అధికారిక రాష్ట్రంగా పరిగణించనున్నారు.